ఎల్బీనగర్, డిసెంబర్ 1: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును అప్‌డేట్ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తికి టోకరా వేశారు. బాధితుడి ఖాతా నుంచి రూ.1.33 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్‌లోని రాఘవేంద్రనగర్‌కు చెందిన వేణుగోపాల్ సాయి(30కి గుర్తు తెలియని వ్యక్తి ఎస్‌బీఎస్ ఉద్యోగిగా ఫోన్ మాట్లాడాడు.
నీ దగ్గర ఉన్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. ఎస్‌బీఐ యాప్ ద్వారానే కార్డును అప్‌డేట్ చేసుకోవాలని చెప్ప డంతో గోపాల్ నమ్మాడు.
యాప్‌లో ఫీచర్‌ను డిసేబుల్ చేసి, మరో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. గుర్తుతెలియని వాట్సా ప్ కాల్ ఫోన్ చేసి, యాప్‌లో వివరాలను నమోదు చేయాలని చెప్పాడు. గోపాల్‌సాయి తన బ్యాంకు వివరాలను యాప్‌లో నమోదు చేయగానే క్రెడిట్‌కార్డుల నుంచి మొత్తం రూ.1,33,650 నగదును కాజేశారు. దీంతో వేణుగోపాల్‌సాయి బోరుమన్నాడు. వెంటనే ఎల్బీనగర్‌లోని సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.