calender_icon.png 3 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పేదొకటి.. చేసేదొకటి

03-02-2025 12:28:12 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 5న ధర్నా 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : దేశవ్యాప్తంగా ప్రజలకు మంచి చేస్తాం... ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రభుత్వ విధానాలను తీసుకువస్తాం అంటూ ప్రజలను నమ్మబలికి అధికారం లోకి వచ్చిన వెంటనే ఎందుకు ప్రజా సమ స్యలను నిర్లక్ష్యంగా గాలికి వదిలేస్తున్నారని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని చేపడుతు న్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు.

ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిగ్గా లేదని, ప్రజలకు తీర ఇబ్బందులు గురి చేసి ఇలా ఉందని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపా రు.

ఇద్దరు నాకు భారీ ఎత్తున ప్రజల హాజ రుకావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరద గాలన్న, సిఐటియు జిల్లా కోశాధికారి బి చంద్రకాంత్, జిల్లా నాయకులు రాజ్ కుమా ర్, ప్లంబర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి ముక్తార్ ఖాన్, నాయకులు మోహన్ రావు, సయ్యద్ జాంగిర్, తదితరులు పాల్గొన్నారు.