calender_icon.png 22 April, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులందరికీ ఒకే గుడి.. ఒకే బావి

22-04-2025 12:49:05 AM

ఆర్‌ఎస్సెస్ అధినేత మోహన్ భగవత్

అలీగఢ్, ఏప్రిల్ 21: కుల భేదాలకు స్వస్తి పలికి, సామాజిక ఐక్యత సాధించాలని రాష్ట్రీయ స్వయం సేవ క్ సంఘ్ (ఆర్‌ఎస్సెస్) అధినేత మో హన్ భగవత్ హిందువులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘ఒకే గుడి.. ఒకే బావి.. ఒకే శ్మశాన వాటిక’ సూ త్రాన్ని అవలంభించాలని పేర్కొన్నా రు.

అలీగఢ్‌లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోహన్ భగవత్ స్వయం సేవకులతో మాట్లాడారు. శాంతి కోసం భారతదేశం తన ప్రపం చ బాధ్యతను నెరవేర్చాలంటే నిజమై న సామాజిక ఐక్యతను సాధించడం అత్యంత కీలకమన్నారు. సంప్రదా యం, సాంస్కృతిక, నైతిక విలువలు మూలాలుగా కలిగిన సమాజాన్ని నిర్మించాలని స్వయం సేవకులను కోరారు.

ఇందుకోసం సమాజంలో ని అన్ని వర్గాలకు చేరువ కావాలని.. వారిని నివాసాలకు ఆహ్వానించాల ని, క్షేత్రస్థాయిలో సామరస్యం, ఐక్య తా సందేశాన్ని వ్యాప్తి చేయాలన్నా రు. జాతీయవాదం, సామాజిక ఐక్య త పునాదులు బలపడాలంటే పండుగలను సాముహికంగా జరుపుకోవా లని తెలిపారు. సంస్కారం అనే పు నాదిపై నుంచి కుటుంబం, దాని వి లువలు రూపుదిద్దుకున్నాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు.