ట్రైనీ కానిస్టేబుల్స్ ఇంటరాక్ట్లో ఎస్పీ కే నారాయణ రెడ్డి
వికారాబాద్ రూరల్ జూన్ 28 (విజయక్రాంతి) : పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలని ట్రైనీ కానిస్టేబుల్స్ ఇంటరాక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా శిక్షణ కేంద్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంద ని, దీంట్లో శిక్షణ పొందటం అదృష్టం అన్నా రు. క్రమశిక్షణ, ఏకాగ్రతతో కష్టపడి పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలని కోరారు. జూలై 1 నుంచి మారుతున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాల న్నారు. అనంతరం శిక్షణా కేంద్రంలోని తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, బ్యారక్, వంట గదిని పరిశీలించారు. కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపాల్ పీవీ మురళీధర్, డీటీసీ డీఎస్పీ విజయ్ కుమార్, డీటీసీ ఇన్స్పెక్టర్ వెంకట్ రామ్, పీసీఆర్ ప్రమీల, అర్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.