* అగ్నివీర్ సైనికుల పాసింగ్ అవుట్ పరేడ్
* కమాండెంట్ బ్రిగేడియర్ ప్రశాంత్ భాజ్‌పేయ్
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్ సైనికులు దేశ సేవలో చిత్తశుద్ధి చూపాలని కమాండెంట్ బ్రిగేడియర్ ప్రశాంత్ భాజ్‌పేయ్ సూచించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్ సైనికుల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
592 అగ్నివీర్ సైనికులు ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రశాంత్ భాజ్‌పేయ్ మాట్లాడుతూ దేశ సమగ్రత, గౌరవాన్ని కాపాడటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. శిక్షణ కాలంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన అభ్యర్థులకు ఈ సందర్భంగా మెడల్స్ అందించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 592 అగ్నివీర్ సైనికుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.