calender_icon.png 19 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు నిస్వార్థంగా సేవలందించాలి

19-03-2025 02:27:39 AM

వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18(విజయక్రాంతి): ఆపదలో ఉన్న నిరుపేదలకు నిస్వార్ధంగా సేవలు చేయడం ఒక వరం లాంటిదని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ స్పష్టం చేశారు. క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడి అధికార పర్యటనలో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ మండలం యాపాల్ పట్టి గ్రామంలో ఏర్పాటుచేసిన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మారుమూర ప్రాంత ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి గ్రామాల్లో పాఠశాల, దేవాలయాల అభివృద్ధికి వాసవి క్లబ్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. దీనిలో భాగంగా ఆ గ్రామంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధికి రూ. 25000 ఇస్తామని గ్రామ పటేల్ కు హామీ ఇచ్చారు.వాసవి క్లబ్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, సేవలో ముందు వరుసలో ఉంటుందన్నారు.

ఆసిఫాబాద్ వాసవి క్లబ్ 18 ఏళ్లుగా ప్రతి ఏడాది ఒక గ్రామంను దత్తత తీసుకొని పలు సేవా కార్యక్రమాలను చేపట్టిందని కొనియాడారు. క్లబ్ సేవలను మరింత విస్తృతపరిచి నిరుపేదలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు బట్టలు, చిన్నారులకు పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు.

అంతర్జాతీయ అధ్యక్షుడి అధికార పర్యటనలో భాగంగా  డీఎంహెచ్వో  సీతారాం కృషి మేరకు గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సహాపంక్తి భోజనంలో గ్రామ ప్రజలతో కలిసి  భోజనాలు చేశారు. అంతకుముందు అంతర్జాతీయ క్లబ్ అధ్యక్షుని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల నడుమ గుస్సాడి బృందంతో స్వాగతం పలికారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ, జిల్లా సభ్యులు కిషోర్, వెంకటేష్, వంశీ, లావణ్య, ముక్త శ్రీనివాస్, రేణిగుంట శ్రీనివాస్, ఎక్కిరాల శ్రీనివాస్, బాల సంతోష్, గంధం శ్రీనివాస్, చిలివేరి వెంకటేశ్వర్లు వేణు, గుండా ప్రమోద్, ఆసిఫాబాద్ వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాత శ్రీనివాస్ ముక్క కృష్ణమూర్తి కోశాధికారి కిషోర్, ఆర్యవైశ్యులు, గ్రామ పటేల్లు ఆత్రం రాజు, భీమ్రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

బెల్లంపల్లి, మార్చి 18 : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ పర్యటనలో భాగంగా బెల్లంపల్లి వాసవి క్లబ్ సభ్యులు దత్తాత్రేయ ట్రేడర్స్ యజమాని శ్రీనివాస్  సహకారంతో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంకును బహుమతిగా అందజేశారు.

నిరుపేద మహిళకు కుట్టుమిషన్ ను పాత భాస్కర్ కుమారుడు పాత నవీన్ కుమార్ ఆర్థిక సహకారంతో అందజేశారు. పాఠశాల విద్యార్థులకు  బ్యాగులు, కంపాక్షులు అందించారు. ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు డైరీలు, పెన్నులను అందజేశారు. అమ్మ అనాధాశ్రమానికి రెండు సీలింగ్ ఫ్యాన్లను దాతల సహకారంతో అందజేశారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ , గవర్నర్ ఇల్లందుల కిషోర్ , అంతర్జాతీయ ఆఫీసర్లు శ్రీనివాస్, బాల సంతోష్, జిల్లా సెక్రెటరీ సర్వీస్ కొంకుముట్టి వెంకటేష్ , జిల్లా వైస్ గవర్నర్ బాలమోహన్, జిల్లా కోశాధికారి వేణుగోపాల్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విద్యాసాగర్ ,పెద్ది రాజేందర్, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కొడిప్యాక శ్రీనివాస్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాత భాస్కర్, క్లబ్ అధ్యక్షులు సామా మహేష్, సెక్రటరీ అవునూరు సాయి, ట్రెజరర్ తాటి పెళ్లి సాగర్ లు పాల్గొన్నారు.