calender_icon.png 24 February, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి

24-02-2025 06:48:57 PM

ఇల్లెందు (విజయక్రాంతి): గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ధర్మ గురువు బోజు మహారాజ్ అన్నారు. ఇల్లందు పట్టణంలో సోమవారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ సేవలు చీరస్మరణీయమని కొనియాడారు.

గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ప్రతి ఏడాది నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సేవాలాల్ సేన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రేమ్చంద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రవి నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డేనియల్ లతో పాటు డిఎస్పి చంద్రభాను, తహసిల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.