calender_icon.png 29 March, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

26-03-2025 12:08:53 AM

జాతీయ యువజన పురస్కార గ్రహీత పానుగంటి మహేశ్ కుమార్

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని జాతీయ యువజన పురస్కార గ్రహీత, ఐషు ఫౌండే షన్ ప్రధాన కార్యదర్శి పానుగంటి మహేష్ కుమార్ అన్నారు ఈ మేరకు మంగళవారం  గాంధీ నగర్‌లోని ఘం టసాల గ్రౌండ్స్‌లో స్పోరట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ పోటీలను నిర్వహించా రు.

ఈ సందర్భంగా హాజరైన మహేష్ కుమార్ క్రీడల్లో రాణించిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  మానసి క ఉల్లాసానికే కాకుండా శరీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతా యన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు  ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్య క్రమంలో నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ జిల్లా అధికారిని కుష్బూ గుప్త, క్రికెట్ కోచ్ రాజ్ కుమార్, వాలీబాల్ సీనియర్ కోచ్ ఆంజనేయులు, బి ఆర్ ఎస్ భోలక్పూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు కిషోర్ కుమార్, ప్రవీణ్, సోహెల్, అఖిల్, స్వామి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.