04-03-2025 01:31:56 AM
ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి
మేడ్చల్ , మార్చి౩ (విజయక్రాంతి) విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి అన్నారు.మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఉత్కరిస్ట్ 2కె 25 మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలిపారు.
జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌ఎస్ దిలీప్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించాలని సూచించారు. మూడు రోజులపాటు జరుగు ఈ స్పోరట్స్ మీట్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జే నరసింహారెడ్డి, కార్యదర్శి త్రీ లోక్ రెడ్డి, కార్యదర్శి త్రిశూల్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.