calender_icon.png 17 March, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

16-03-2025 06:57:19 PM

బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు...

బాన్సువాడ (విజయక్రాంతి): విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో బంగారు పథకాలు సాధిస్తున్న వారందరూ మారుమూల గ్రామాల ప్రాంతాలకు చెందిన వారేనని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు. గ్రామస్థాయి క్రీడాకారులకు స్కిల్స్ ఎక్కువగా ఉంటాయని క్రీడల్లో చదువులో ముందుండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూడవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీర్కూరు పాఠశాల చిన్న గుడిసె స్థాయి నుంచి ప్రస్తుతం కార్పొరేట్ స్తాయి లాంటి పాఠశాలగా ఎదగడము అభినందనియమన్నారు. రానున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ మార్కులు  సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. బీర్కూరు ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం స్థానిక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి వల్ల రెండున్నర ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న పాఠశాల నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధాకృష్ణ అశోక్ రెడ్డి మేకల విటల్ రఘు సానేపు గంగారం తదితరులు పాల్గొన్నారు.