19-04-2025 12:00:00 AM
కాగజ్ నగర్, ఏప్రిల్ 18(విజయ క్రాంతి): కాగజ్‌నగర్ మండలం అందవెల్లి,బోడపల్లి గ్రామాలను అడ్డాలుగా చేసుకొని వివిధ గ్రామా లకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న 100 కిలోల నకిలీ పత్తి విత్త నాలను స్వాధీనం పరచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణ ప్రతాప్ తె లిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అందవెల్లి గ్రామానికి చెందిన మహేందర్ నకిలీ బిటి విత్త నాలను మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్ద గ్రామానికి చెందిన సల్మాన్ నుండి తీసుకు వచ్చి ఈ ప్రాంతంలో అమ్మకాలు చేపట్టేందుకు యత్నించగా విశ్వ సనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది విత్తనాల తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు.
పట్టుబడ్డ విత్తనాల విలువ రూ. 3.50 లక్షలు ఉంటుందని నకి లీ విత్తనాలను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్బిసిఐ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వారి వివరాలు పోలీసులకు తెల పాలని సూచించారు. దాడుల్లో ఎస్‌ఐ వెంకటేష్ సిబ్బంది మధు, రమేష్ పాల్గొన్నారు.