17-12-2024 01:02:14 AM
* పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
ఎల్బీనగర్, డిసెంబర్ 16: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఆదివారం పోలీసులు భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురి అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాం ప్ ఆఫీస్‌లో సోమవారం సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ బీర్‌మీర్ జిల్లాకు చెందిన మంగీలాల్ అలియాస్ మం గీలాల్ బిష్ణోయ్(21), మంగీలాల్ అలియాస్ మంగీలాల్ ఢాకా(25), భీరారామ్ (25) హైదరాబాద్‌లోని మీర్‌పేట పీఎస్ పరిధి అశోక్‌రెడ్డి కాలనీలో ఉంటున్నారు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి లేదా డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నా రు. మధ్యప్రదేశ్‌కు చెందిన పింటూ అలియా స్ మోహన్‌సింగ్‌ను సంప్రదించగా.. తక్కువ ధరలో గంజాయిని పంపిస్తానని పింటూ హామీ ఇచ్చాడు. అనుకున్నట్లుగానే పింటూ 53 కిలోల గంజాయి(గసగసాలగడ్డి)ని రైలు, రోడ్డు మార్గాల్లో హైదరాబాద్‌కు చేరవేశాడు.
ఈ నెల 15న సాయంత్రం నాదల్‌గుల్‌లోని అశోక్‌రెడ్డి కాలనీలో గంజాయి(గసగసాల గడ్డి)ని విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా ఎల్బీనగర్ ఎస్‌వోటీ, మీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 53 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ మార్కెట్‌లో రూ.1.25 కోట్లు ఉం టుందని పోలీసులు తెలిపారు. వీరితోపాటు కేసుతో సంబంధమున్న బీఎన్‌రెడ్డికి చెందిన శంకర్‌లాల్, కరీంనగర్‌కు చెందిన శర్‌వాన్‌పై కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్, అదనపు డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్‌స్పెక్టర్లు భాస్కర్‌రెడ్డి, ముదసిర్ అలీ నాగరాజు పాల్గొన్నారు.
మార్కెట్‌లోకి పప్పీ స్ట్రావ్ డ్రగ్స్
నాదర్‌గుల్‌లో అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న గంజాయిని పప్పీ స్ట్రావ్ అనే డ్రగ్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు తెలిపారు. గసగసాల గడ్డి నుంచి నల్లమందు (ఓపియం) తీసిన తర్వాత మిగిలిన పొట్టును గసగసాల గడ్డి అంటారని తెలిపారు. దీని పొడిని పప్పీస్ట్రావ్ అనే డ్రగ్స్‌గా మార్చి సేవిస్తారని వివరించారు.