calender_icon.png 25 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు 1.52 లక్షల కోట్లు

24-07-2024 12:36:45 AM

  • పరిశోధనలకు పెద్ద పీట 
  • రొయ్యల సాగుకు సహకారం 
  • 400 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే

న్యూఢిల్లీ, జూలై 23: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలను పెంచేందుకు, అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని నిర్మలమ్మ ప్రకటించారు. అలాగే సప్లు చెయిన్స్, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కూడా ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 

పరిశోధనలకు పెద్దపీట

వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేయనుంది. నూనె గింజలు, పప్పుధాన్యా ల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ వంటి వాటికి ఈ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారు. ముఖ్యమైన నూనె గింజలయిన వేరుశనగ, సెసమే సీడ్స్, పొద్దుతిరుగుడు, ఆవాలు వాటి ఉత్పత్తిలో స్వయం సమృ ద్ధి సాధించడమే లక్ష్యమని నిర్మలమ్మ ప్రకటించారు. 

కూరగాయల సాగుకు క్లస్టర్లు

కూరగాయల సాగుకోసం కొత్తగా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీని వల్ల కూరగాయలను సాగు చేస్తున్న అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. అధిక వినియోగం ఉండే ప్రాంతాల సమీపంలో వీటిని నెలకొల్పుతామని పేర్కొంది. కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్ వంటి అవసరాల కోసం ప్రత్యేక సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేసేలా స్టార్టప్స్, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహించ నున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఈ ఖరీఫ్ సీజన్‌లో 400 జిల్లాలలో డిజిటల్‌గా పంటల సర్వేను చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు 6 కోట్ల మంది రైతుల నుంచి ఈ సర్వే ద్వారా డేటా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 

రొయ్యల సాగుకు సహకారం... 

ఈ బడ్జెట్‌లో రొయ్యల సాగుకు కూడా ఊతమిచ్చారు. రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామని, నాబార్డ్ ద్వారా ఈ నిధులను సమకూర్చ నున్నట్లు మంత్రి తెలిపారు. రొయ్యల సంతానోత్పత్తి కేంద్రాల నెట్‌వర్క్ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా రొయ్యల ఎగుమతుల్లో వృద్ధి సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలోని సాంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న సెక్టార్లకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంది.