హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని వరంగల్ రోడ్డు పరకాల క్రాస్ వద్ద ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన జూపాక రమేష్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం హుజురాబాద్ కు వచ్చి తిరిగి స్వగ్రామం వీర నారాయణపూర్ కు వెళ్తుండగా పరకాల క్రాస్ రోడ్ వద్ద బోలేరో వాహనం అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రమేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంకు సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తిరుమల గౌడ్ తెలిపారు.