10-04-2025 12:00:00 AM
కామారెడ్డి, ఏప్రిల్ 09,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులోని పెద్ద చెరువులో బుధవారం ముత్యంపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి మల్లవ్వ (46) భర్త ఎల్లయ్య కులము చాకలి వృత్తి కుల వృత్తి ముత్యంపేట గ్రామస్తురాలు గత కొద్దికాలం నుంచి ముత్యంపేట గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ ఉండడంతో ఆమె ఒంటరిగా ఉన్నాను అంటూ తరుచుగా మనోవేదన కు గురి అయ్యేదనీ,రోజు మాదిరిగానే మంగళవారం కామారెడ్డి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
దాంతో కుటుంబ సభ్యులు ఆమె కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయక పోవడం తో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతుక గా ముత్యంపేట గ్రామ శివారులో ని పెద్ద చెరువు లో బుధవారం ఉదయం శవమై కనిపించిందని ఆమె మరిది కొత్తపల్లి రాములు పిర్యాదు చేయగా దోమకొండ ఎస్సై స్రవంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.