calender_icon.png 25 April, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

24-04-2025 04:57:33 PM

కల్తీ కల్లు వల్ల మృతి చెందారు అంటున్న గ్రామస్తులు..

కామారెడ్డి జిల్లా సరంపల్లిలో ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): కల్తీ కల్లు సేవించి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా... సరంపల్లి గ్రామానికి చెందిన చిన్న బాల్ రాజు(45) కు రోజు కల్లు తాగే అలవాటు ఉంది.  కల్లు సేవించడం  ఎక్కువైతే అతని స్నేహితులు ఇంటి  వద్ద వదిలేసి వెళ్తుంటారని గ్రామస్తులు తెలిపారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి కూడా కళ్ళు ఎక్కువ తాగడంతో స్నేహితులు ఇంటి వద్ద వదిలేసి వెళ్లినట్టుగా తెలిసింది. అప్పటికే ఆ వ్యక్తి ఉన్నఫలంగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పాటు కల్తీ కల్లు సేవించడం ఎక్కువై కింద పడడంతో గాయాలు అయ్యాయా లేక ఎవరైనా దాడి చేశారేమోనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాల్ రాజు మృతి చెందడం కలకలం రేపుతుంది. కల్తీ కల్లు ఎక్కువ కావడం వల్లే కింద పడి మృతి చెందుతే కల్లు మూస్తే దారులు కుటుంబ సభ్యులతో మధ్యవర్తులతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సరంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. అందరితో కలుపుగోలుగా ఉండే బాలరాజు మృతి చెందడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు ఎక్కువగా సేవించడం వల్లనే కిందపడి మృతి చెందినట్లు గ్రామస్తులు వాపోతున్నారు.