17-02-2025 06:51:34 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని వెంకట్రావుపేట ఎక్స్ రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి నూర శేఖర్ 32 సంవత్సరాల యువకుడు మృతి చెందడం జరిగిందని ఆదనపు ఎస్సై రామయ్య సోమవారం తెలిపారు. ఎస్సై రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వాడు మృతుడు ఆదివారం కడెం మండలంలో బంధువుల అంతక్రియలకు హాజరై తిరిగి తన హోండా బైకుపై వస్తుండగా వెంకట్రావుపేట ఎక్స్ రోడ్డు వద్ద అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి రోడ్డుపై పడిపోగా తలకు గాయమైందిన్నారు. స్థానికులు గమనించి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోవడం జరిగిందన్నారు. మృతుని భార్య నూరు అనూష పిర్యాదు మేరకు ఆదనపు ఎస్సై రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.