మేడ్చల్, అక్టోబర్ 5: రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మరణించిన ఘటన మునీరాబాద్ శివారులో శనివారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ కు చెందిన లారీ డ్రైవర్ జగదీశ్ (35) శనివారం తెల్లవారుజామున క్లీనర్‌తో కలిసి టిఫిన్ చేయడానికి మునీరాబాద్ శివారులోని ఔటర్ సర్వీసు రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా అనంతకుమార్ అతివేగంగా బైక్‌తో జగదీశ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.