calender_icon.png 26 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడదెబ్బతో ఒకరి మృతి

25-04-2025 06:15:56 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అంగడి బజార్ కు చెందిన వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని అంగడిబజార్ ప్రాంతంలో నివాసముండే వేమూరి కరుణాకర్(72) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందారు. మృతుడు పనినిమిత్తం మధ్యాహ్నం పాత బస్టాండ్ కు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రం వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లెలోగా మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు. మృతినికి భార్య, కుమారుడు ఉన్నారు.