06-02-2025 06:40:28 PM
ఖానపూర్ (విజయక్రాంతి): మామడ మండలంలోని దిమ్మదుర్తి సమీపంలో, మోటర్ సైకిల్ అదుపుతప్పి ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికీ చెందిన పన్నేల భీమేశ్వర్ (56) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నిర్మల్ నుండి ఖానాపూర్ వైపు వెళ్తున్న AP 01AH 2315 నంబర్ గల మోటార్ సైకిల్ అదుపుతప్పి, కింద పడిపోవడంతో, ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల భీమేశ్వర్ తలకు తీవ్రమైన గాయం కావడంతో, అక్కడికక్కడే మృతి చెందినట్లు, మామడ ఎస్సై సందీప్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో, మృతుని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.