హుజురాబాద్ (విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రైవేట్ సర్వేయర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని మాందాడి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాందానపల్లి గ్రామానికి చెందిన మామిడాడ రవీందర్ రెడ్డి(50) అనే వ్యక్తి హుజురాబాద్ కి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తున్నాడు. మాందాడి పల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళింది. ఈ ప్రమాదంలో మామిడాల రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రైవేట్ గా భూములు కొలిచే సర్వేయర్ అని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.