calender_icon.png 22 December, 2024 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైర్ పేలి కారు బోల్తా.. ఒకరు మృతి

06-10-2024 08:36:43 PM

అలంపూర్,(విజయక్రాంతి): కారు టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన దుర్ఘటన అలంపూర్ పరిధిలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న మారుతి బ్రెజ్జా కారు జాతీయ రహదారిపై బీచుపల్లి సమీపంలోని విజయవర్దిని ఆయిల్ మిల్లు కారు వద్ద టైరు పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏపీ కర్నూల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు విచారించి మృతదేహాన్ని స్థాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.