calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు మద్దతు పలకాలి

21-03-2025 01:46:38 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చ్ 20 (విజయ క్రాంతి) : వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని కళాశాలలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు రోజుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్  తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... గతంలో పార్లమెంట్ లో చట్టాలు రూపొందిస్తే పాలకులకు తప్ప ప్రజలకు తెలిసేది కాదన్నారు.

యువత రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో పీఎం నరేంద్ర మోదీ కొత్త చట్టాల అమలు చేయడంలో వారిని భాగస్వాములు చేస్తున్నారన్నారు. ఒకే సారి అన్ని ఎన్నికలు నిర్వహిస్తే సమయంతో పాటు  వేల కోట్ల ప్రజల ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.వై.కే అధికారి సుశీల్ బర్డ్, కళాశాల ప్రిన్సిపల్ పున్నరావ్, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు