26-03-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి25 (విజయక్రాంతి): దేశ రక్షణలో భాగంగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నిర్వహించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని పార్టీ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. మంగ ళవారం పెంచికల్ పేట్ మండలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోనీ శ్రీశైలంతో కలసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. క్షేత్రస్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వినర్ వీరభద్ర చారి,నాయకులు ప్రసాద్ గౌడ్,గడ్డల కరణ్, సత్యనారాయణ, నానయ్య, నారాయణ, ప్రభాకర్, నాగేష్, పురుషోత్తం, శ్రీనివాస్ పాల్గొన్నారు