28-03-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి) : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ మేరకు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక‘ విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా దేశ అభివృద్ధి కొరకు జాతీయ జనతా పార్టీ దృఢ నిశ్చయంతో ఉందని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిఅన్నారు దేశవ్యాప్తంగా పదేపదే జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు అడ్డంకులకు గురవుతుండటమే కాకుండా, ప్రజాధనం వృధాగా ఖర్చవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఒకే సారి ఎన్నికల ద్వారా పాలనను మరింత సమర్థంగా మార్చే దిశగా బీజేపీ కట్టుబడి ఉంది.
అని అన్నారు. ఈ విషయంలో ప్రజల మద్దతు కీలకం. ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం వల్ల పాలనా వ్యవస్థలో సమన్వయం పెరుగుతుంది. అభివృద్ధి ప్రణాళికలు నిరంతరాయంగా అమలు చేయగలుగుతాం.దీనిపైన మన భారత దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది కాబ్బటి మొదటి మద్దతు మీ కళాశాల నుంచే కోరడం జరుగుతోందని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ ప్రగతికి నిబద్ధతతో పని చేస్తోందని ‘ ఒకే దేశం ఒకే ఎన్నిక‘ విధానాన్ని ప్రజలందరూ స్వాగతించి, దేశ భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దేందుకు మద్దతుగా నిలవాలని ఆయన విద్యార్థులకు పి లుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి,ఓబీసీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబెర్ ఓం సింగ్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేవైఎం ఇంచార్జి అమంద్ విజయ్ కృష్ణ,బీజేపీ సీనియర్ నాయకులు సురేష్, లక్ష్మణ్ చౌకి,నవీన్, సుదర్శన్, బాలన్న,విష్ణు, రత్నం పటేల్, బీజేపీ నాయకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు