calender_icon.png 19 March, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణం

19-03-2025 12:00:00 AM

పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ

కామారెడ్డి అర్బన్, మార్చి 18 (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక బిజెపి దృక్పధమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కామారెడ్డి బిజెపి పార్టీ కార్యాలయంలో  కార్యశాల (వర్క్ షాప్ ) నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్ర ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉండటం వల్ల అభివృద్ధి కి ఆటంకం కలుగుతుందని, ఆర్థికంగా కూడా చాల భారం కలుగుతుందని, రాజకీయంగా కూడా అనిశ్చితి ఏర్పడుతుందని అందుకే నరేంద్ర మోది గారు దూర దృష్టితో  జమిలి ఎన్నికల పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ఛైర్మెన్ గా, హోమ్ మంత్రి అమిత్ షా, గులాం నబీ ఆజాద్, కశ్యప్ ఇలా అన్ని  వర్గాల వ్యక్తులతో కమిటీ వేయటం జరిగిందనీ,

ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకే సారి రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు  నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా కేవలం పాలన పై దృష్టి కేంద్రీకరించ వచ్చు అని అంతే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ అనిశ్చితి వచ్చి ప్రభుత్వం కూలీ పోయిన, కేంద్ర ప్రభుత్వం సరియైన భలం లేక కూలిపోయిన మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించి తర్వాత యధావిధిగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించవచ్చు అని సూచించారు.

అంతే కాకుండా జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితి నీ పెంచడమో తగ్గించడమో చేసి జమిలి ఎన్నికలు నిర్వహణ చేపట్టాలని కమిటీ సూచించిదని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు కావాలనే రాద్దాంతం చేసి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంపొందించాలని చూస్తున్నాయని అన్నారు.

కావున ఈ అంశం పై బీజేపీ దృక్కోణాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కార్యశాల లు నిర్వహించి కార్యకర్తలకు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో పార్టీ ఉందని ప్రతి బీజేపీ కార్యకర్త ఈ విషయంపై సమగ్ర సమాచారంతో ప్రజలకు, మీడియా మిత్రులకు, వివరించి ప్రతి పక్షాల కుట్రలను భగ్నం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు రాష్ట్ర నాయకులు రంజిత్ మోహన్, మురళీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.