27-03-2025 10:38:42 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశనిర్దేశం చేయడం జరిగింది. ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆర్థికంగా ఎంతో డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా అధికార యంత్రం ఎన్నికల కోడ్ ద్వారా చేసే పనిలో సమయం వృధా అవుతుంది కాబట్టి ఒకేసారి ఎన్నిక జరగడం ద్వారా డబ్బు వృధా కాకుండా సమయం వృధా కాకుండా దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఐదు సంవత్సరాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే ఆర్థికంగా సమయానుసారంగా పనులు జరుగుతాయని ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బిజెపి నాయకులు బి శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ అంకం గారి దత్తు సంతు పటేల్ సాయి రెడ్డి శివకుమార్ లక్ష్మణ్ రాము సాయిలు గంగారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.