17-03-2025 12:29:00 AM
దేశంలోని 65 కు పైగా పార్టీల ఆమోదం
నిజామాబాద్ మార్చ్ 16: (విజయ క్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న దేశ పార్లమెంటు లోక్సభ రాష్ట్ర ల అసెంబ్లీ స్థానిక సంస్థ ఎన్నికలలో ఒకేసారి నిర్వహించడం అని ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న విధానాన్ని బిజెపి 1984 నుండి ప్రోత్సహిస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దండుపాల్ సూర్యనారాయణ అన్నారు.
ఆదివారం రోజు నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని కి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడరూ. బిజెపి పార్టీ 2019. 2024 మేనిఫెస్టోలో ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని తన మేనిఫెస్టో ప్రకటించిందని ఆ మేనిఫెస్టో అమలుకే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ విషయమై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నస్తస్థాయి కమిటీ నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సూచించిన ప్రకారం మొదటి దశలో లోక్ పి సభ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించాలని రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించిందని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయాన్ని తగ్గించ డంతో దేశ ఆర్థిక వ్యయాన్ని కాపాడు కో వచ్చని ఆయన అన్నారు. ఎన్నికల ఖర్చులలో అవినీతి తగ్గుతుందని 2024 లోక్సభ ఎన్నికల అంచనా వ్యయం 1, 35 లక్షల కోట్ల రూపాయలు వ్యయమైందని ఆయన తెలిపారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజా పాలన సవ్యంగా సాగుతుందని దంపాల్ సూర్యనారాయణ తెలిపారు.
అసలు వారిగా ఎన్నికల ప్రక్రియ జరిగితే ఎన్నికల నిర్వహణకై కోటి మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల పనిలో పాల్గొనడం వల్ల ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న అభ్యర్థనలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రతి ఎన్నికల్లో జాతీయ నాయకులు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనడం వల్ల అధిక ధన వ్యయం అవుతుందని ఆయన తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఈ పద్ధతి వల్ల ఆ దేశాలలో ప్రజా పాలన భంగం కలగకుండా ఆర్థిక వ్యయం ఆ దేశాలకు తగ్గుతోందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. మన దేశంలోనే 65 కు పైగా రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలు జరపాలని ఆమోదం తెలిపాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం చేశారు.