మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి) : మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం బాలానగర్ మండలం పెద్దాయి పల్లి గ్రామ శివారులో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం పరిశీలించారు.
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దాయి పల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 63 స్థలం లో 4 ఎకరాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించినట్లు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నర్సింహులు, రెడ్కో డి.ఎం.మనోహర్ రెడ్డి, ఎస్.పి.డి.సి.యల్ డి. ఈ చంద్ర మౌళి, ఏ.పి.ఎం.నాగ రాజు, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ రెడ్డి తదితరులు ఉన్నారు.