calender_icon.png 9 October, 2024 | 2:44 AM

ఎస్సీ వర్గీకరణకు ఏక వ్యక్తి న్యాయకమిషన్

09-10-2024 12:44:09 AM

రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు

యుద్ధప్రాతిపదికన బీసీ ఓటర్ల గణనకు తీర్మానం

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

 హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏక వ్యక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫా ర్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని తీర్మానించింది.

దీంతోపాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకా కుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నాల్గోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.

సమావేశానికి మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనరసింహా, సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతోపాటు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి, ఆయా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రా ల్లో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకుగానూ మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్టు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడు తూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని నిర్ణీత సమ యం నిర్దేశించుకుని పూర్తిచేయాలన్నారు. యుద్ధప్రాతి పదికన బీసీల సాంఘిక, ఆర్థిక గణన చేపట్టాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.