calender_icon.png 19 February, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క అక్షరం తేడా.. 5 కోట్లు ఫట్!

16-02-2025 12:18:38 AM

  1. మేఘా కంపెనీపై సైబర్ అటాక్ 
  2. నెదర్లాండ్ కంపెనీగా తప్పుడు మెయిల్
  3. రూ. 5.47 కోట్లు కాజేసిన నేరగాళ్లు 
  4. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌పై సైబర్ అటాక్ జరిగింది. ఈ సంస్థ నుంచి సైబర్ నేరగాళ్లు  ఏకంగా రూ. 5.7 కోట్లు కాజేశారు. నెదర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి ఎక్విప్‌మెంట్‌ను ఆర్డర్ చేస్తూ మేఘా సంస్థ ఆ కంపెనీకి రెగ్యులర్‌గా చెల్లింపులు చేస్తున్నది.

చెల్లింపులపై ఆ కంపెనీ మేఘా సంస్థకు కన్ఫ ర్మేషన్ మెయిల్ పంపుతుంది. ఈ వ్యవహారాన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు మె యిల్ ఐడీలో ఒక అక్షరాన్ని మార్చి నెదర్లాండ్ కంపెనీలాగానే మేఘా సంస్థకు మెయిల్ పంపించారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడంలేదు.. మరో అకౌంటుకు డబ్బుటు చెల్లించాలంటూ అందులో పేర్కొన్నారు.

అది నిజమని భావించిన మేఘా కంపెనీ.. సైబర్ నేరగాళ్లు పంపిన అకౌంట్‌లో రెండు విడతలు గా మొత్తం రూ. 5.47 కోట్లను జమ చే‚సిం ది. అయితే మీకు పంపిన ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులు ఇంకా చెల్లించలేదేంటని నెదర్లాండ్‌కు చెందిన అసలు కంపెనీ నుంచి మెయిల్ రావడంతో మోసపోయినట్టుగా మేఘా కంపెనీ గ్రహించింది.

దీంతో మేఘా కంపెనీకి  చెందిన అకౌంట్ మేనేజర్ శ్రీహరి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వి భాగానికి ఫిర్యాదు చే శారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.