నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 14 రోజుకు చేరుకుంది. దీక్ష సభ్యులు పాల్గొన్న ఉద్యోగులు ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఒంటి కాలుపై నిలబడి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గంగాధర్, రాజరత్నం, అపర్ణ, హరీష్, జ్యోతి, గజేందర్, లతా, సుజాత, వీణరాణి తదితరులు పాల్గొన్నారు.