calender_icon.png 26 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష రేషన్ కార్డులు

26-02-2025 01:04:53 AM

ఒక్కరోజులోనే పంపిణీకి ప్రణాళికలు 

తొలుత హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో.. 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక.. మిగతా జిల్లాల్లో

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఎంతోకాలం నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందిం చింది. మార్చి1వ తేదీన ఒక్కరోజే లక్ష మంది లబ్ధిదారులకు కార్డులు పంపి ణీ చేయనున్నది. ఎన్నికల కోడ్ కారణంగా, కోడ్ అమలులో లేని మూడు ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో అందిచను న్నది.

కోడ్ ముగిసిన మరుసటి రోజు (మార్చి 8వ తేదీ) నుంచి మిగతా జిల్లాల్లో పంపిణీ చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు కార్డులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. సర్కార్ ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద జనవరి 26న 16,900 కుటుంబాలకు కార్డు లు ఇచ్చింది. తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.

అయితే.. తాజాగా కోడ్ అమలులో లేని జిల్లాల్లో కార్డుల పంపిణీ చేయా లని నిర్ణయించి, అందుకు మార్చి 1వ తేదీని ఎంచుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా, వాటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. కార్డు దరఖాస్తులకు గడువు తేదీ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని, మీ సేవా కేంద్రాల్లో కేవలం రూ.50 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.