calender_icon.png 16 January, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా విక్రయ దారునికి రూ. లక్ష జరిమానా

05-09-2024 02:41:24 PM

జడ్చర్ల, (విజయక్రాంతి): భూత్పూర్ మండలం పరిధిలోని నల్లకుంట తండాకు చెందిన విశ్లావత్ చిన్న రాములు అనే వ్యక్తినాటు సార విక్రయాలు చేస్తున్న నేపథ్యంలో నిందితుడికి రూ. లక్ష జరిమానా విధించినను ఆబ్కారీ పోలీసులు తెలిపారు. ఆబ్కారీ  పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూత్పుర్ మండలం నల్లకుంట తండాకు చెందిన రాములు గత  రెండు నెలల క్రితం నాటుసారా అమ్ముతుండగా ఆబ్కారీ పోలీసులు పట్టుకొని భుత్పురు తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

ఈ క్రమంలో ఎప్పుడైనా నాటు సారా అమ్మితే రూ. లక్ష జరిమానా చెల్లించాలని నిందితుడికి హెచ్చరించారు. ఈ క్రమంలో తనిఖీ లో భాగంగా ఆబ్కారీ పోలీసులు నిందితుడి  ఇంటికి వెళ్లి సెర్చ్ చేయగా  (1.6) లీటరులు  నాటు సారా దొరికింది. గతంలో నిందితుడు బైండోవర్ అయిన నేపథ్యంలో నిందితుడికి రూ. లక్ష జరిమానా వేసి వసూలు చేసినట్లు జడ్చర్ల అబ్కారీ సిఐ విప్లవరెడ్డి తెలిపారు.  నాటు సారాయి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని నాటు సారాయి విక్రయిస్తూ ఎవరైనా  పటుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.