కామారెడ్డి జిల్లా పరమలలో గ్రామస్తుల తీర్మానం..
కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తే లక్ష జరిమానా విధించాలని ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరుమళ్ళ గ్రామంలో గ్రామస్తులు తీర్మానం చేశారు. బెల్టు షాపుల నిర్వహణతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. యువత మద్యం మత్తులో చెడిపోతున్నారని గ్రామస్తులు గ్రహించి గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహించవద్దని తీర్మానం చేశారు. తీర్మానాన్ని వ్యతిరేకించి బెల్ట్ షాపు నిర్వహిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు కట్టడి చేసుకున్నారు. బెల్టు షాపులను గ్రామంలో ఎవరు ప్రోత్సహించిన అమ్మిన సహించేది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.