calender_icon.png 26 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష సైన్యం వెనక్కి

26-10-2024 01:10:07 AM

ఎల్‌ఏసీ నుంచి 

బలగాల ఉపసంహరణ

రెండువైపులా 

18 కిలోమీటర్ల బఫర్‌జోన్

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సరిహద్దుల నుంచి భారత్ తమ బలగాల ఉపసంహరణ ప్రారంభించాయి. వాస్తవాధీన రేఖ వెంట రెండు దేశాల గస్తీని 2020 ఏప్రిల్‌కు పూర్వపు పరిస్థితికి తేవాలని ఇటీవల రెండు దేశాలు ఒప్పందానికి రావటంతో నాలుగేండ్లుగా లఢక్ సరిహద్దుల్లో ఎదురెదురుగా ఉన్న సైన్యాలను వెనక్కు రప్పిస్తున్నారు. భారత దాదాపు 40 వేల సైనికులను వెక్కు పిలుస్తుండగా, చైనా 50 వేల మంది సైనికులను వెనుకకు తీసుకెళ్తున్నది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీ నాటికి పూర్తవుతుంది. 

36 కిలోమీటర్ల దూరం

లఢక్‌లోని గల్వాన్ లోయలో 2020 మే 5వ తేదీ అర్థరాత్రి రెండు దేశాల గస్తీ సైనికుల మధ్య ఘర్షణ చెలరేగి ప్రాణ నష్టం సంభవించిన తర్వాత ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు అక్కడికి భారీగా సైనికులను తరలించాయి. ఇంతకాలం అదే స్థాయిలో సైనికులను మోహరించాయి. తాజా ఒప్పందంతో ఎల్‌ఏసీకి అటువైపు 18 కిలోమీటర్లు, ఇటువైపు 18 కిలోమీటర్ల దూరానికి సైన్యం వెళ్లిపోవాలి. ఇప్పుడు అదే జరుగుతున్నది. అంటే రెండు దేశాల సైనికుల మధ్య ఇకపై 36 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తూర్పు లఢక్‌లోని దేప్‌సాంగ్, దెమ్‌చోక్, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ, ప్యాంగ్యాంగ్ సో సరస్సు ఉత్తర తీర ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కు వెళ్లిపోతున్నాయి.