calender_icon.png 1 April, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిప్పర్ ఢీకొని ఒకరి మృతి

26-03-2025 01:46:55 AM

భీమదేవరపల్లి మార్చి 25 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో హనుమకొండ నుండి హుస్నాబాద్ కు వస్తున్న కారును అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు లో ప్రయాణం చేస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన కనగా పూడి కర్ణాకర్ మంగళవారం మృతి చెందినట్లు ముల్కనూర్ ఎస్త్స్ర సాయిబాబా తెలిపారు.

అతివేగంగా వస్తున్న లారీ కారు ఢీకొట్టగానే కారులో ప్రయాణం చేస్తున్న కనక పూడి కరుణాకర్ ను 108 ద్వారా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన మృతినట్లు ఎస్త్స్ర తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.