13-02-2025 01:56:17 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 12 : వర్ని మండలం జాకోర ఎక్స్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరి మృతి చెందారు. ఎస్త్స్ర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ అతివేగంగా ఆజాగ్రత్తగా నడపడంతో గుర్తుతెలియని వ్యక్తినీ డీకొట్టింది.
అతని తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.