calender_icon.png 28 April, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. అన్నదమ్ముల్లో ఒకరు మృతి

28-04-2025 08:45:03 AM

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి(Miyapur Police Station Area)లో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములు హైదర్, రెహమాన్  బైకుపై జేఎన్ టీయూ నుంచి మియాపూర్(From JNTU to Miyapur) వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.