15-04-2025 07:39:16 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి(40) అనే వ్యక్తిని మంగళవారం జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ మీదుగా టీఎస్ 25 టి 2940 అనే నెంబర్ గల డీసీఎం వ్యాన్ లోడుతో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఆ పక్క నుండే ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న తిరుపతిని ఢీకొనడంతో టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సృజనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు.
తిరుపతి మృతితో పట్టణంలో విషాద ఛాయలు..
పురం శెట్టి తిరుపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు భార్య ఉన్నారు. చిన్న వయసులోనే తిరుపతి మృతి చెందడంతో ఆ కుటుంబం రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే తిరుపతి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అతని మిత్రులు శ్రేయోభిలాషులు ఈ వార్త విని దుఃఖ సాగరంలో మునిగిపోయారు.