26-02-2025 12:33:56 AM
మరొకరికి తీవ్ర గాయాలు
కోదాడ ఫిబ్రవరి 25: ద్విచక్ర వాహనం టాటాఏసీ ఢీకొని ఒకరు మృతి చెంది మరొకరికి గాయాలైన సంఘటన కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ విజయవాడ కోదాడ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న మంత్రి ప్రగడ కనకేశ్వర శర్మ (55 )కుక్కడపు పుల్లయ్య ఇద్దరు ద్విచక్ర వాహనంపై కొమరబండలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ప్రాజెక్ట్ పనిమీద వెళ్లి తిరిగి కోదాడకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలోని కొమరబండ రహదారిపై హైదరాబాద్ నుండి కోదాడకు వస్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొట్టడంతో కనికేశ్వర శర్మ అక్కడక్కడ మృతి చెందాడు.. కుక్కడపు పుల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.మృదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్త్స్ర అనిల్ రెడ్డి తెలిపారు.