ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి గుండాల మండలాల మార్గమధ్యలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇల్లందు మండలం పోలారం నుండి మర్రిగూడెం మీదుగా టేకులపల్లి వస్తున్న భద్రుతండా గ్రామానికి చెందిన బానోత్ గణేష్ (28) ఆయన నానమ్మతో కలిసి టేకులపల్లి వస్తుండగా కాచినపల్లి స్పోర్ట్స్ స్కూల్ పిల్లలను తీసుకొని 30 మంది పిల్లలతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొని గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్ నాయనమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు.