15-03-2025 01:04:01 AM
మహమ్మదాబాద్ మార్చి 14: చట్టం అందరికి సమానం అంటారు. ఇది నిజం కూడా.. కాగా అది సామాన్యులు తప్పు చేస్తే ఒక న్యాయం అదే అధికారులు తప్పు చేస్తే మరో న్యాయం అనేలా జూలపల్లి అటవీ లో వృక్షాలను కొట్టి కట్టెలను అమ్ముకున్న సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఇతర మొక్కలను పెట్టేందుకుగాను చదును చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే చదును చాటున వృక్షాలను సైతం కొట్టి విక్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.
నీలగిరి తో పాటు వివిధ వృక్షాలను కొట్టి అమ్మిన అధికారులపై చర్యలు మాత్రం ఆలస్యం అవుతుంది. ఇందుకు అధికారులు చెబుతున్న కారణాలు కూడా ఉన్నాయి. అసలు పట్టుకున్న లారీలో కట్టెలు జూలపల్లి అడవిలోనివా ? కాదా ? అని అధికారులు విచారణ వేగవంతం చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ఆలస్యం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆమనగల్లు ఫారెస్ట్ అధికారులు కట్టెల లారీ ని కుల్కచర్ల సమీపంలో పట్టుకున్న తర్వాత మహమ్మదాబాద్ మండలం జూలపల్లి అటవీ ప్రాంతానికి వచ్చి స్థానికుల నుంచి వివరాలు తీసుకొని సంతకాల సేకరించారు.ఇక్కడ నుంచి కట్టిన తరలించడం జరిగిందా ? లేదా? అనే కోణాల్లో షాద్ నగర్ ఫారెస్ట్ అధికారి అబ్దుల్ హైమద్ అజిజ్ నేరుగా తనిఖీలు చేపట్టారు. మరో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
కట్టెల లారీ వెనక అధికారులు ఎందరు ?
ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ భాజప్త కట్టెలు కొట్టి అమ్ముకుంటున్న పట్టించుకునే వారి కరువారని పరిస్థితి నెలకొంటుంది. ఉన్నతాధికారుల సైతం అతి తక్కువ దూరంలో ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షణ అంతంత ఉంది. చదును చేయాలని అనుమతులు ఇస్తూ ఆ చదును క్రమంలో పెద్ద వృక్షాలను కొట్టి అమ్ముకుంటున్న ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణమని కూడా తెలుస్తుంది.
పనులు ఏమాత్రం ఉన్నాయి ? ఎక్కడ జరుగుతున్నాయి ? చదును కు సంబంధించి ఎన్ని ఎకరాల్లో జరిగింది అనే కోణాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయడం లేదని తెలుస్తుంది. అనుమతులు ఇవ్వడం వరకే ఉన్నతాధికారులు కాగితాలపై సంతకాలు చేస్తూ అనుమతులు ఇస్తూ కిందిస్థాయి అధికారులు ఏం చేస్తున్నారో పర్యవేక్షణ లేకపోతే ఈ కట్టెల వెనుక ఎంత మంది అధికారులు ఉన్నారు విచారణ చేస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-సామాన్యులైతే అప్పుడే ప్రెస్ మీట్...
సామాన్యులు కలప అక్రమంగా తరలించిన, వారిపై కేసులు నమోదైన వెంటనే ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ లు పెట్టి మా అధికారులు ఎంతో విలువైన సంపదన ను కుల్లగొట్టి అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని, తరలిస్తున్న కలపకు ఇంత మొత్తం విలువ ఉంటుందని గొప్పగా చెబుతారు. అధికారులే అటవీ లోని వృక్షాలను కొట్టి అమ్ముకున్నారని, జూలపల్లి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి, కట్టెల తరలిస్తున్న వారి సైతం ఇక్కడ తెచ్చామని చెప్పినా..
ఈ ప్రక్రియ అంత వారం రోజుల క్రితం నుంచి జరుగుతున్న అధికారులు నేరుగా మాత్రం వెల్లడించలేదు. విషయం తెలుసుకున్న విజయ క్రాంతి డిఎఫ్‌ఓ సత్యనారాయణ సంప్రదిస్తే నిజమే విచారణ జరుగుతుందని తెలిపారు. ఇక్కడ కూడా సామాన్యులకు అధికారులకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు ఎవరు చేసిన సమాచారం అందింన వెంటనే అధికారులు తెలియజేస్తే మరింత బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
గ్రామస్తుల నుంచి సాక్షి సంతకాల స్వీకరణ
ఆమనగల్లు ఫారెస్ట్ అధికారులు జూలపల్లి ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న కొంతమంది దగ్గర వివరాలు సేకరించి సంతకాలు సైతం తీసుకున్నారు. కేవలం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాత్రమే ఇంతటి అక్రమాలకు పాల్పడతాడా ? వీరి వెనుక పై స్థాయి అధికారులు ఎంతమంది ఉన్నారని కొండల్లో కూడా విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మొక్కలను పెంచి వృక్షాలను చేయాలని కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్న విషయం విధితమే. ప్రభుత్వానికి వివిధ విభాగాల్లో అధికారులను నియమిస్తూ పర్యవేక్షణ చేయాలని చెబుతున్నా.. అక్రమాలకు పాల్పడుతు వృక్షాలను నేలమట్టం చేసి విక్రయించి స్వలాభం కోసం శాయశక్తులకు కృషి చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నివేదిక వచ్చిన తర్వాత చర్యలు...
అధికారులు ఎవరెవరు ఉన్నారు. ఈ ప్రక్రియ ఎలా జరిగింది అనే కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదు. అవసరమైన చర్యలు తీసుకొని మును ముందు మరింత పర్యవేక్షణ పెంచుతాం.
సత్యనారాయణ, డీఎఫ్‌ఓ