- పీఆర్‌ఆర్‌డీ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలపై కసరత్తు
- గత ప్రభుత్వంలో సకాలంలో అందక ఇక్కట్లు
- మంత్రి సీతక్క చొరవతో సమస్యకు పరిష్కారం
- 92 వేల మంది సిబ్బందికి చేకూరనున్న లబ్ధి
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): పదేళ్లుగా సకాలంలో జీతాలు రాక అవస్థలు ఎదుర్కొన్న పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి(పీఆర్‌ఆర్‌డీ) శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలు త్వరలోనే తీరనున్నాయి. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించనున్నది.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీఆర్‌ఆర్‌డీ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ప్రతినెలా మొదటి తేదీనే జీతా లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పీఆర్‌ఆర్‌డీ శాఖలో పార్ట్‌టైం, ఫుల్ టైం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 92 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీ
రంగా గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెం ట్లు, ఆఫీస్ స్టాఫ్, సెర్ప్ సిబ్బంది, వీఏవోలు గా ఆయా స్కీముల్లో పనిచేస్తున్నారు. అయి తే గత ప్రభుత్వంలో మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు రావడంతో తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. ఇటీవల మంత్రి సీతక్కను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నా రు. వెంటనే స్పందించిన సీతక్క సకాలంలో జీతాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
వేర్వేరు బడ్జెట్ కేటాయింపులు..
జీతాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినా స్కీముల అమలు, జీతాలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండటంతో జీతాలు చెల్లించడానికి ఇక్కట్లు ఏర్పడ్డాయి. దీంతో స్కీముల అమలు, జీతాలకు వేర్వేరుగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. జీతాల చెల్లింపునకు నూతన విధానం తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.
దీంతోపాటు క్షేత్రస్థాయిలో మ్యానువల్‌గా చెల్లింపుల ప్రక్రియ కాకుండా ఆన్‌లైన్‌లో ఏకకాలంలో సిబ్బందికి చెల్లింపు లు జరిగే విధానాన్ని పీఆర్‌ఆర్‌డీ అవలంబించనున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రి సీతక్క ఆదేశాలతో నూతన విధానానికి సం బంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయగా, ఈ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖకు పంపినట్టు తెలుస్తుంది.
ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి, ఈ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 92 వేల మంది సిబ్బందికి ఎప్పటికప్పుడు జీతాలందే అవకాశం ఉంటుంది.