calender_icon.png 29 March, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల దాడిలో ఒకరికి గాయాలు

26-03-2025 08:55:59 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోతుల దాడిలో చింత లక్ష్మిరెడ్డి గాయాలపాలయ్యారు. గాయాలైన వ్యక్తిని మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు. కోతుల బెడదతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్చి వస్తుందని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు కోతుల బెడద నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు.