22-03-2025 05:21:19 PM
నాగల్ గిద్ద: మండలం కరస్ గుత్తి గోవిందా తాండ నివాసి ఫులిబాయి వయసు 55 సంవత్సరాలు ఉట్ పల్లి గ్రామంలోని వ్యవసాయ పొలంలో పిడుగు పడి బర్రె, మేక, గొర్రె మృతి చెందగా, ఫులిబాయి అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. దీంతో కరస్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. జరిగిన ప్రమాదాన్ని తెలుసుకొని కారస్ గుత్తికి నాగల్ గిద్ద తహసిల్దార్ శివకృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ హన్మంతు రెడ్డి, హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది వివరాలు తెలుసుకొని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు