calender_icon.png 12 February, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బోల్తా ఒకరికి గాయాలు

12-02-2025 12:00:00 AM

బాన్సువాడ, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని నస్రుల్లాబాద్ శివారులోని అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ కారు బోల్తా పడింది. మంగళ వారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడకు చెందిన కీర్తి వెంకటేష్ కారులో నిజామాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకటేష్‌కు గాయాల య్యాయి. స్థానికులు  బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిజామాబాద్ రిఫర్ చేశారు.