calender_icon.png 25 March, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒకరికి గాయాలు

22-03-2025 12:00:00 AM

వెంకటాపురం/చర్ల, మార్చి 21 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం ముత్యం దార జలపాతం సమీపంలో బాంబు పేలుడు. పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను తొక్కి బొగ్గుల కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఐయ్యాయి .బొంగు కర్రల కోసం అటవీకి ప్రాంతానికి వెళ్ళిన సమయంలో ప్రమాదం జరిగింది ,గాయపడిన వ్యక్తిని 108 ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

కాలు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేసారు మరో ముగ్గురు వ్యక్తులు దూరంగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. వెంకటా పురం వీరభద్రవరం  గ్రామ సమీపంలోని ముత్యం ధార జలపాతం సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అవటం జరిగింది బాధితుడు ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి నలుగురు యువకులు వెదురు బొంగుల కోసం అడవి ప్రాంతానికి వెళ్లిన నలుగురు గ్రామస్తులు తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.