calender_icon.png 16 April, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ని ఢీకొట్టిన బైక్ ఒకరికి గాయాలు

15-04-2025 10:41:54 PM

చిలుకూరు: చిలుకూరు నుండి బేతావోలు వెళ్లే రహదారిపై కరక్కాయల గూడెం స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బేతవోలుకి చెందిన మోహనరావు, అనే వ్యక్తి మఠంపల్లిలో ధాన్యం లోడు దింపి, తిరిగి చిలుకూరు నుండి బేతవోలు వెళ్తూ మార్గం మధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్, చిలుకూరు నుండి బేతావోలు బైకుపై వెళ్తున్న బేతావోలు గ్రామానికి చెందిన ఎర్రమళ్ళ ఏడుకొండలు, వెనకనుండి ట్రాక్టర్ని ఢీకొట్టడంతో అతని తలకు బలమైన గాయాలు తగిలాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని అతన్ని 108 లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించినారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.