- తప్పించుకునేందుకు ఖైదీల యత్నం
- పోలీసుల కాల్పులతో తొక్కిసలాట
కాంగో, సెప్టెంబర్ 3: కాంగో రాజధాని కిన్షాసాలోని మకాల జైలులో ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులు కాల్పుల జరపగా తొక్కిలసాట కూడా జరిగింది. దీంతో 129 మంది ఖైదీలు మృతి చెందారు. మకాల జైలు సామర్థ్యం 1,500 కాగా కారాగారంలో 12 వేల మంది ఖైదీలు ఉన్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ తెలియజేసింది. పోలీసుల కాల్పు ల్లో 24 మంది చనిపోగా 59 మందికి గాయాలయ్యాయి. ఖైదీలు తప్పించుకుంటున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం భద్రతా సిబ్బంది వరకు కాల్పులు జరిపారు. జైలు నుంచి ఎవరూ పారిపోలేదని అధికారులు స్పష్టం చేశారు.